పోరాటానికి ఇవే సాక్ష్యాలు.. గాయాలను చూపిస్తూ కృనాల్ పాండ్యా పోస్ట్
- ఎంఐపై ఆర్సీబీకి విజయాన్ని అందించిన కృనాల్ పాండ్యా
- తీవ్రమైన నొప్పితో బాధపడుతూ 73 పరుగులు చేసిన ఆల్‌రౌండర్
- మ్యాచ్ అనంతరం తన గాయాల ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న కృనాల్
- ఈ సీజన్లో అద్భుత ఫామ్‌లో ఉన్న కృనాల్ పాండ్యా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, తనలోని పోరాట యోధుడిని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశాడు. నిన్న ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. అనంతరం ఆ పోరాటంలో తనకు తగిలిన గాయాలను చూపిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు.
రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్య ఛేదనలో కృనాల్ అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించాడు. కఠినమైన పిచ్‌పై, కండరాల తిమ్మిర్లతో తీవ్రంగా బాధపడుతూనే క్రీజులో నిలబడ్డాడు. కేవలం 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేసి ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత కృనాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గాయాల తాలూకు ఫొటోలను పంచుకున్నాడు. "కొన్ని గాయాలు మనం పోరాడటానికి తగినవని నిరూపిస్తాయి" అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక, ఈ సీజన్లో కృనాల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లలో 35.50 సగటు, 150.00 స్ట్రైక్ రేట్‌తో 141 పరుగులు సాధించి తన బ్యాటింగ్ సత్తాను చాటుతున్నాడు. అటు బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.